Site icon NTV Telugu

Raj Tarun: పరిస్థితులే తప్పులు చేయిస్తాయి.. లావణ్య ఇష్యూపై రాజ్ తరుణ్ సంచలనం

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

Raj Tarun Indirectly Responded on Lavanya Issue : చాలా కాలం నుంచి సాగుతున్న లావణ్య వ్యవహారం గురించి పరోక్షంగా స్పందించాడు రాజ్‌ తరుణ్‌. వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, న్యాయస్థానం ఎదుట తాను నిరూపించుకుంటానని ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి పరోక్షంగా మాట్లాడుతూ మీడియా ముందుకువచ్చి మాట్లాడటం తనకు నచ్చదన్నారు. ‘‘నిజం ఏంటనేది నాకు తెలుసు, వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకువచ్చి ముందుపెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నా వరకూ నేను సంతోషంగా ఉన్నానా? లేదా? అనేది మాత్రమే ముఖ్యం’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి, నేను అక్కడ నిరూపించుకుంటే సరిపోతుంది, అందుకు కావాల్సిన సాక్ష్యాలు కూడా నా వద్ద ఉన్నాయని అన్నాడు.

Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??

ఇక మనుషులు ఎప్పుడూ తప్పులు చేయరని.. పరిస్థితులే వారి చేత తప్పులు చేయిస్తాయని రాజ్ కామెంట్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. రాజ్‌ తరుణ్‌ నటించిన ‘తిరగబడరా సామీ’ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకోగా ఈ సినిమాలో ఆయనకు జంటగా మాల్వీ మల్హోత్ర యాక్ట్‌ చేసింది. ఆమెతో అఫైర్ పెట్టుకునే తనను రాజ్ తరుణ్ వదిలేశాడు అంటూ లావణ్య మీడియా ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమా రిలీజ్‌ కి రెడీ అవుతోంది. శివ సాయి వర్ధన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కావలసి ఉంది కానీ వాయిదా వేశారు. సెప్టెంబర్‌ 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Exit mobile version