Site icon NTV Telugu

రాజ్ కుంద్రా తరపు లాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ పోర్న్ కిందకు రాదని అన్నారు. అదొక వెబ్ సిరీస్ అని సదరు న్యాయవాది పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్టు ఉంటేనే పోర్న్ కిందకు వస్తుందని.. కానీ రాజ్ కుంద్రా వీడియో షూట్ లోని కంటెంట్ వెబ్ సిరీస్ లకు లోబడి చేసిందే గాని, పోర్న్ ను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదని చెప్పుకొచ్చారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన రాజ్ కుంద్రాపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version