పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్ కూడా అశ్లీల కంటెంట్ ను చిత్రీకరించి పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిపినట్టు వెల్లడించింది. రాజ్ కుంద్రా పరోక్షంగా కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ యజమాని, పెట్టుబడిదారుడు కూడా. కానీ కుంద్రా ఇలాంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. రాజ్ కుంద్రా ఇప్పటికి ఎన్ని కాంట్రవర్సిల్లో చిక్కుకున్నారో చూద్దాం.
1) బెట్టింగ్ కుంభకోణం
రాజస్థాన్ రాయల్స్ అనే ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తమ సొంత క్రికెట్ జట్టును స్థాపించారని అందరికీ తెలుసు. అందులో కుంద్రా 2013లో బెట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆ తరువాత ఆయన క్రికెట్‌కు సంబంధించిన ఏ కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధం విధించారు. అయితే 2018లో ఢిల్లీ పోలీసులు అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండేళ్లపాటు సస్పెండ్ అయిన తరువాత రాజస్థాన్ రాయల్స్ జట్టు టోర్నమెంట్లో తిరిగి స్థానం సంపాదించారు. అనంతరం రాజ్, శిల్పా క్రికెట్ లీగ్‌తో తమ అనుబంధాన్ని ముగించారు.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
2) పూనం పాండే ఆరోపణలు
ఈ ఏడాది ప్రారంభంలో పూనమ్ పాండే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆమె యాప్ ను రాజ్ సంస్థ నిర్వహించింది. కానీ వారితో పూనమ్ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా రాజ్ ఆమె చిత్రాలను, వీడియోలనుయాప్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కుంద్రా తన వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను లీక్ చేసినట్లు కూడా పూనమ్ పాండే వెల్లడించింది. అయితే రాజ్ ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేశాడు. తాను 201 లోనే ఆ సంస్థ నుండి నిష్క్రమించానని పేర్కొన్నాడు.
3) మాజీ భార్య మోసం చేసిందంటూ…
శిల్పా శెట్టి రాజ్ కుంద్రా రెండవ భార్య. ఇద్దరూ వివాహం చేసుకున్నప్పటి నుండి చాలా ఆమె మొదటి భార్య గురించి కథలు ప్రచారం జరిగాయి. అయితే ఇటీవలే రాజ్ తన మాజీ భార్యతో ఏమి జరిగిందో చెప్పుకొచ్చాడు. శిల్పా కారణంగానే రాజ్ తో తన వివాహం బంధం ముగిసిపోయిందని ఆయన మాజీ భార్య కవిత చెప్పింది. కానీ ఆమె ప్రకటనలకు విరుద్ధంగా రాజ్ మాజీ భార్య తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
4) మనీలాండరింగ్ కేసు
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2019లో రాజ్ కుంద్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. డ్రగ్ పెడ్లర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ రంజీత్ బింద్రాతో రాజ్ డీలింగ్ చేశాడు. ఈ కేసులో కొన్ని గంటలు ప్రశ్నించింది. ఈ విచారణలో బింద్రాతో తన ఒప్పందం ప్రకారం బాస్టియన్ హాస్పిటాలిటీలో 50% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన గత లావాదేవీల గురించి తనకు తెలియదని రాజ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!