Raj Kundra : కిడ్నీ దానం వ్యాఖ్యలపై ట్రోల్స్‌కి కౌంటర్ ఇచ్చిన రాజ్ కుంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా స్వామీజీ తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా, రాజ్ కుంద్రా స్పందిస్తూ.. “మీరు ఒప్పుకుంటే నా కిడ్నీని దానంగా ఇస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గతంలో పోర్న్ వీడియోల నిర్మాణం కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పేరు మళ్లీ తెరపైకి రావడంతో, నెటిజన్లు ఆయనను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. “ఈ కిడ్నీ దానం వ్యాఖ్యలు కూడా పబ్లిసిటీ కోసం చేశాడు” అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోల్స్‌పై రాజ్ కుంద్రా తనదైన శైలిలో స్పందించారు.
Also Read : Mutton Soup : ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ లాంచ్..
Also Read
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
“ప్రస్తుతం మనం ఎంత విచిత్రమైన ప్రపంచంలో ఉన్నామో చూడండి. ఒకరు తమ శరీరంలోని భాగాన్ని మరొకరి ప్రాణం కోసం దానం చేయాలనుకుంటే, దాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఒకవేళ మీ దృష్టిలో మంచితనం పీఆర్ స్టంట్ అయితే, ఈ ప్రపంచం అలాంటి పీఆర్ స్టంట్స్‌ని ఇంకా ఎక్కువగా చూడాలి. మానవత్వం ఒక వ్యూహం అయితే, దాన్ని మరింత మంది స్వీకరించాలి. మీడియా లేదా మీ ట్రోల్స్ నన్ను ప్రభావితం చేయవు. అవి నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను ఎవరినీ ఆకర్షించడానికి ఈ మాటలు చెప్పలేదు. దయచేసి ఇతరుల గురించి తక్కువగా మాట్లాడండి, ఎక్కువ ప్రేమ పంచండి. మీరు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడగలరు” అంటే ఆవేదన వ్యాక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Strange world we live in when someone chooses to offer a part of themselves to save another’s life, it’s mocked as a PR stunt. If compassion is a stunt, may the world see more of it. If humanity is a strategy, may more people adopt it. I’m not defined by labels the media or…
— Raj Kundra (@onlyrajkundra) August 15, 2025
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!