Mutton Soup : ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో–హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మటన్ సూప్’. “విట్‌నెస్ ది రియల్ క్రైమ్” ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాకు రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొన్నారు.
Also Read : Sunny Deol : ‘రామాయణ’లో తన పాత్ర గురించి.. సన్నీ డియోల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Also Read
ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ – “టైటిల్ పోస్టర్ బాగుంది. ‘మటన్ సూప్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ.. “మా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు గారికి ధన్యవాదాలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మంచి చిత్రంతో రాబోతున్నాం” అన్నారు. హీరో రమణ్ మాట్లాడుతూ ’టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ అద్భుతంగా వచ్చాయి. రాత్రింబవళ్లు కష్టపడి చేస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు. అలాగే దర్శకుడు రామచంద్ర వట్టికూటి కూడా మాట్లాడుతూ “మా మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు కె.ఎస్.రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది” అన్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?