Site icon NTV Telugu

Raj Kundra : కిడ్నీ దానం వ్యాఖ్యలపై ట్రోల్స్‌కి కౌంటర్ ఇచ్చిన రాజ్ కుంద్రా

Raj Kundra

Raj Kundra

ప్రముఖ వ్యాపార‌వేత్త, బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్ ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆ సంద‌ర్భంగా స్వామీజీ తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా, రాజ్ కుంద్రా స్పందిస్తూ.. “మీరు ఒప్పుకుంటే నా కిడ్నీని దానంగా ఇస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గతంలో పోర్న్ వీడియోల నిర్మాణం కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పేరు మళ్లీ తెరపైకి రావడంతో, నెటిజన్లు ఆయనను తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. “ఈ కిడ్నీ దానం వ్యాఖ్యలు కూడా పబ్లిసిటీ కోసం చేశాడు” అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్రోల్స్‌పై రాజ్ కుంద్రా తనదైన శైలిలో స్పందించారు.

Also Read : Mutton Soup : ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ లాంచ్..

“ప్రస్తుతం మ‌నం ఎంత విచిత్రమైన ప్రపంచంలో ఉన్నామో చూడండి. ఒకరు తమ శరీరంలోని భాగాన్ని మరొకరి ప్రాణం కోసం దానం చేయాలనుకుంటే, దాన్ని పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఒకవేళ మీ దృష్టిలో మంచితనం పీఆర్ స్టంట్ అయితే, ఈ ప్రపంచం అలాంటి పీఆర్ స్టంట్స్‌ని ఇంకా ఎక్కువగా చూడాలి. మానవత్వం ఒక వ్యూహం అయితే, దాన్ని మరింత మంది స్వీకరించాలి. మీడియా లేదా మీ ట్రోల్స్ నన్ను ప్రభావితం చేయవు. అవి నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను ఎవరినీ ఆకర్షించడానికి ఈ మాటలు చెప్పలేదు. దయచేసి ఇతరుల గురించి తక్కువగా మాట్లాడండి, ఎక్కువ ప్రేమ పంచండి. మీరు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడగలరు” అంటే ఆవేదన వ్యాక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version