NTV Telugu Site icon

రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం

Raj Kundra may now be charged under money laundering and foreign exchange violation acts

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా భర్తను జూలై 19న అరెస్టు చేశారు, అశ్లీల చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై మరో 11 మందితో పాటు జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. బెయిల్ విచారణలో కుంద్రా కస్టడీని జూలై 27 వరకు పొడిగించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజ్ కుంద్రపై మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చర్యల కింద ఈ నెల చివరిలో జూలై 26 తర్వాత ఎప్పుడైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందనేది తాజా సమాచారం.

Read Also : “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా

విదేశీ మారకద్రవ్యం ఉల్లంఘనతో కూడిన ఈ కేసులో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయమని ముంబై పోలీసులు ప్రోటోకాల్ ప్రకారం ఈడీకి తెలియజేస్తారని, కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించే ముందు ముంబై పోలీసుల నుంచి మొదటి సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) కాపీని ఈడీ తీసుకుంటుందని ఓ నేషనల్ మీడియా సంస్థ పేర్కొంది. ముంబై కార్యాలయంలో అతన్ని ప్రశ్నించడానికి ముందు పిఎమ్‌ఎల్‌ఎ, ఫెమా కింద కుంద్రాకు ఈడీ సమన్లు ​​జారీ చేయవచ్చు. రాజ్ కుంద్రా కేసులో అశ్లీల చిత్రాలను నిర్మించడంతో పాటు కొన్ని యాప్ ల ద్వారా షేర్ చేశారు. దాని దర్యాప్తులో యాప్ కు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలలో కుంద్రా ప్రమేయం గురించి ముంబై పోలీసులు చేసిన వాదనలు, వాట్సాప్ చాట్‌ల గురించి ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈడీ విచారణ సాగిస్తుంది. ఇక ఈ పోర్న్ రాకెట్ లో కుంద్రాపై భారతీయ శిక్షాస్మృతి (410 మోసం), 34 (సాధారణ ఉద్దేశం), 292 మరియు 293 (అశ్లీల మరియు అసభ్య ప్రకటనలు, ప్రదర్శనలకు సంబంధించిన) సెక్షన్లపై, ఐపిసి ఐటి చట్టం, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధ) చట్టంలోని సంబంధిత వివిధ చట్టాల కింద ముంబై పోలీసులు కేసులు నమోదు చేశారు.