Site icon NTV Telugu

Rahul Ravindran: మణిరత్నం..బోయపాటి బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొడుకుని కంటే వాడే సుజిత్!

Og Rahul Ravindran

Og Rahul Ravindran

అందాల రాక్షసి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్, తర్వాతి కాలంలో దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం లేదు, కానీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరుస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే, తాజాగా ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

Also Read :Kanthara -1 : డబ్బింగ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపా.. ఏంటీ దారుణం

రాహుల్ రవీంద్రన్ ట్విట్ చేస్తూ, మణి సార్ అండ్ బోయపాటి గారు వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి, ఓ కొడుకుని కంటే వాడే జీతు (సుజిత్).. ఈ సినిమా ఒక మూడ్ ఏం టాలెంట్ అబ్బా.. అంటూ పవన్ సార్ ఓజెస్ గంభీర కాదు, తేజస్ గంభీర.. తమన్, రవి సార్, మనోజ్ సార్, అలాగే సినిమాకి పనిచేసిన టీం మొత్తం అంటూ ఫైర్ సింబల్స్ పెట్టాడు. అంతా బాగానే ఉన్నా, మణిరత్నం, బోయపాటి గారు వెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి ఓ కొడుకుని కంటే అనేది కొంచెం తేడాగా ఉన్నట్టు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొత్తగా ఒక మనిషిని తయారు చేస్తే అంటే బాగుండేది, కానీ ఇదేం పోలిక రా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version