NTV Telugu Site icon

Raghu Babu: చిరంజీవి ప్రశంసించడం వల్ల.. 400 సినిమాల్లో అవకాశాలు

February 7 (76)

February 7 (76)

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌గా నెలదోక్కుకొవడం ఎంత కష్టమో.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిరుపించుకోవడం అంతకన్న కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడిన సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరిస్తూ ఉంటుంది. నటుడు, కమెడియన్ రఘు బాబు దీనికి మంచి ఉదాహరణ అని చెప్పాలి. రఘుబాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలో లెక్కలేన్నని పాత్రలు చేశాడు. 2005లో అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ తనకు మొదటి బ్రేక్. గుడ్డి రౌడీగా తన క్యారెక్టర్ ఎంతో ఆకట్టుకుంది. పేరైతే వచ్చింది కానీ ఎవరూ ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావించలేదు. అయితే తాజాగా తన కెరీర్ ఇప్పుడు ఇలా ఉండటానికి చిరంజీవి కారణం అని తెలిపారు.

Also Read: Nithiin: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుండి సెకండ్ సింగిల్ అప్‌డెట్

రీసెంట్ గా ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు రఘుబాబు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ‘బన్నీ’ మూవీ లో నా పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. కానీ దీని గురించి మూవీ టీం ఎక్కడ ప్రసంగించలేదు. ఇక అదే మూవీ వంద రోజుల వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో కూడా నాకు అంతగా గుర్తింపు లేకపోవడం చాలా బాధగా అనిపించింది. సరిగ్గా అప్పుడే ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. మూవీలో నటించిన వాళ్ళు, పని చేసినవాళ్లు అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ రఘుబాబు ప్రస్తావన ఎవరూ తేవడం లేదు.. అదేంటయ్యా ఎవరు నీ గురించి చెప్పడం లేదంటూ అన్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నన్ను ఆయన స్టేజి మీదకు పిలిచి భుజం మీద చెయ్యేసి చాలా బాగా చేశావని లైవ్ లో మెచ్చుకున్నాడు. ఈ సినిమా మరోసారి చూడాలంటే నువ్వే కారణం అని చెప్పాడు. ఈ ఒక్క మాట నా లైఫ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంత ఓపెన్ గా చిరంజీవి పొగిడేసరికి నాకు ఆఫర్‌లు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు అక్కడితో మొదలుపెడితే ఏకంగా 400 సినిమాలకు పైగా నటిస్తూనే పోయా. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు పడ్డాయి.’ అంటూ తెలిపాడు.