Site icon NTV Telugu

Raghavendra Rao : ఆ రచయితను రాఘవేంద్రరావు ఎందుకు కిడ్నాప్ చేశారు?

K Ragavedar Rao

K Ragavedar Rao

తెలుగు లెజెండరీ సినీ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె. రాఘవేంద్రరావు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలు రూపొందించిన ఆయన, ఎంతోమందని  స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు ఇప్పటికి సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత కూడా రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు సినిమాలకు పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క మనిషిలో తెలియని అల్లరి, చిలిపి తనం ఉంటుంది. అలాగే రాఘవేంద్రరావు కూడా చాలా అల్లరి పనులు చేశారు.. ఓ రోజు ఏకంగా రచయితనే కిడ్నాప్ చేశారు.

Also read : Aishwarya Rajesh : హిట్ పడిన కూడా.. ఐశ్వర్య రాజేష్‌ను పట్టించుకోరేంటీ..?

అసలు ఏం జరిగింది అంటే.. రాఘవేంద్రరావు ఎక్కువ సమయం రచయితలతో గడుపుతుంటాడు. ఆయన పెళ్లిళ్లకు, గుళ్లకు వెళ్లేటప్పుడు రచయితలను వెంటపెట్టుకుని వెళుతుంటారు. ఎందుకంటే దారిలో వారితో కథా చర్చలు చేయడానికి కంఫర్ట్‌గా ఉంటుందని. ఇలా ఆయనతో ఎక్కువగా ప్రయాణించింది స్టార్ రైటర్ సత్యానంద్. అయితే ఇలా ఓ రోజు తిరుపతి వెళ్లాలని అనుకున్నారు రాఘవేంద్రరావు. సత్యానంద్ కలిసి బయలు దేరారు. దారిలో మరో స్టార్ రైటర్ జంధ్యాల గారి ఇంటి దగ్గర కారు ఆపారట.

‘బయట కాఫీ తాగి ఇప్పుడే వద్దాం రండి’ అని కారులో ఎక్కించుకున్నారట. ఆయనన్ను మాటల్లో పెట్టి మద్రాసు దాటించేశారు. చాలా సేపటి తరువాత తేరుకున్న జంధ్యాల చుట్టూ కనిపిస్తున్న పొలాలను చూసి.. ‘ఇదేంటి పొలాలు కనిపిస్తున్నాయి. ఊరు దాటి పోయినట్లున్నాం. కాఫీకి ఎక్కడికి తీసుకెళ్తున్నారు’ అన్నారట. దానికి రాఘవేంద్రరావు గారు నవ్వుతూ..‘ఇప్పుడు పొలాలు కనిపిస్తాయి.. తర్వాత ఏడు కొండలు కనిపిస్తాయి.. ఆ పైన తాగుదాం కాఫీ’ అన్నారట. దీంతో జంధ్యాల రాఘవేంద్రరావు, సత్యానంద్ పై తీవ్రంగా మండిపడ్డారట. ‘అవతల చాలా అర్జెంటు పనులున్నాయి. వేరే సినిమా కథా చర్చల కోసం నిర్మాత, దర్శకు లను రమ్మని చెప్పాను. వారు వచ్చేసి ఉంటారు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు ’ అని అరిచరట. జంధ్యాల ను చల్లబరచడానికి దాదాపు అరగంట కష్టపడరట. అలా ఉంటాయి రాఘవేంద్రరావు అల్లరి పనులు.

Exit mobile version