Site icon NTV Telugu

Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..

Radhika Mather Deth

Radhika Mather Deth

సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గీత వయస్సు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు చివరి శ్వాస విడిచారు. గీత, ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్. రాధ భార్య. చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన రాధికకు గీత నిరంతరం మద్దతుగా నిలిచారు.

Darshana: భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా: దర్శన

ఆమె జీవితం కుటుంబం, ప్రేమ, సామాజిక సేవలకు అంకితం అయ్యింది. వెనుకబడిన ప్రాంతాల్లో అనేక సామాజిక కార్యకలాపాలలో కూడా ఆమె ప్రతిష్టాత్మకంగా పాల్గొన్నారు. గీత అంత్యక్రియలు సోమవారం, 22 సెప్టెంబర్ 2025, సాయంత్రం 4.30 గంటలకు బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాధిక కుటుంబానికి, సినీ వర్గాలకు, అభిమానులు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గీత జీవితాంతం కుటుంబ, సినిమా, సామాజిక రంగాల్లో చేసిన కృషి చిరస్మరణీయం గా నిలుస్తుంది.

Exit mobile version