Site icon NTV Telugu

Radhika: నటి రాధికకు అస్వస్థత?

Radhika

Radhika

Radhika: ప్రముఖ సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. జులై 28, 2025న ఆమె ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. మొదట సాధారణ జ్వరంగా భావించినప్పటికీ, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి ఆగస్టు 5 వరకు ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.

Read Also: Bihar Election: నితీష్‌కుమార్‌కు షాక్!.. బీజేపీ సీఎం అభ్యర్థిని ఫోకస్ చేసే యోచనలో అధిష్టానం!

రాధికా శరత్ కుమార్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. భరతిరాజా దర్శకత్వంలో వచ్చిన ‘కిళక్కే పోగుం రైల్’ చిత్రం ద్వారా తమిళ సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఆమె, దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతోంది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా ఆమె తనదైన ముద్ర వేసింది. ఆమె అస్వస్థత వార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో #GetWellSoonRaadhika హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Read Also: India: రష్యా చమురు కొనుగోళ్లకు భారత్‌ బ్రేక్‌..?

ఈ డెంగ్యూ జ్వరం అనేది ఈడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్. చెన్నైలో వర్షాకాలంలో ఈ జ్వరం కేసులు పెరగడం సాధారణం. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డెంగ్యూ నియంత్రణ కోసం దోమల పెంపకం నిరోధక చర్యలను ముమ్మరం చేస్తోంది. 2025 జులై 8 వరకు చెన్నైలో 522 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version