Site icon NTV Telugu

యష్ కొడుకా మజాకా… వీడియో వైరల్

Radhika Pandit shares cute video of Yatharv

‘కేజిఎఫ్’ స్టార్ యష్ తనయుడి క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యష్, రాధిక పండిట్ దంపతులకు ఇద్దరు పిల్లలు… కుమార్తె ఐరా, కుమారుడు యథర్వ్. తాజాగా యథర్వ్ క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు రాధిక. ఆ వీడియోలో ఆమె తన కొడుకు గోళ్లను కత్తిరిస్తున్నారు. అయితే చాలా మంది చిన్న పిల్లలు గోళ్లు కత్తిరిస్తున్నప్పుడు భయపడి ఏడుస్తారు. కానీ యథర్వ్ మాత్రం కిలకిలమని నవ్వేస్తున్నాడు. ఇటీవలే ఐరా తన నీడతో ఆడుతున్న వీడియోను కూడా షేర్ చేసింది రాధికా. అయితే ఈ వీడియోల ద్వారా ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేయాలని అనుకుంటోందట. ఇక యష్ విషయానికొస్తే… ఆయన హీరోగా నటించిన “కెజిఎఫ్: చాప్టర్ 2” జూలై 16న విడుదల కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందో లేదో చూడాలి మరి.

View this post on Instagram

A post shared by Radhika Pandit (@iamradhikapandit)

Exit mobile version