NTV Telugu Site icon

Radhika Kumaraswamy: పెంపుడు కుక్కతో ఒంటరిగా పుట్టినరోజు జరుపుకున్న రాధికా కుమారస్వామి

Radhika

Radhika

శాండల్‌వుడ్ నటి రాధిక కుమారస్వామి నవంబర్ 11న తన పుట్టినరోజును జరుపుకున్నారు. కన్నడ నటీనటులు, అభిమానులు రాధికకు శుభాకాంక్షలు తెలిపారు. 2002లో నీనంగి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారామె మంగళూరుకు చెందిన రాధికా కుమారస్వామి శాండల్‌వుడ్‌లో నటిగా, నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నారు.. ఇక తాజాగా రాధిక కుమారస్వామి తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు స్పెషల్ వీడియోను పంచుకున్నారు, అది వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, రాధిక పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పుట్టినరోజు థీమ్‌లో కేక్ కట్ చేసి, పింక్ కలర్ డ్రెస్ ధరించి, ఒక చేతిలో పూల బొకే పట్టుకుని తింటూ సంబరాలు చేసుకుంది. విశేషమేమిటంటే ఈ వీడియోలో రాధిక, ఆమె పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరు. ఇప్పుడు కుక్కకు కూడా కేక్ తినిపించడంపై రాధిక సంతోషం వ్యక్తం చేసింది.

Moses Manikchand Part-2: ఆసక్తికరంగా ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్

రాధిక బర్త్‌డే వీడియో చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్‌డే మేడమ్, ఒంటరిగా ఎందుకు పుట్టినరోజు జరుపుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. రాధికా కుమారస్వామి 14 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ నటిగా ఒక వెలుగు వెలిగింది. ఆమె నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది. సృజన్ లోకేష్ తో ‘నీలమేఘశ్యామ’ సినిమాతో హీరోయిన్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నటుడు విజయ్ రాఘవేంద్రతో ‘నినంగాగి’ సినిమా రాధికకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతోపాటు తావరే బ తంగి, ప్రేమకైది, మణి, మతియా లేని తబ్బలి, మసాలా, ఆటో శంకర్‌, మాండ్య, అనాథరు, స్వీటీ నాన్న జోడితో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇక ఆమె నిర్మాతగా సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే, రాధిక యష్, రమ్య జంటగా ‘లక్కీ’, ఆదిత్య నటించిన ‘స్వీటీ నాన్న జోడి’ చిత్రాలను నిర్మించారు. రాధిక కన్నడ చిత్రాల్లోనే కాకుండా తెలుగు, తమిళ చిత్రాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Show comments