Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!

Radhika Apte

Radhika Apte

Radhika Apte: ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే సినీ ఇండస్ట్రీలోని చేదు నిజాలను మరోసారి బయటపెట్టింది. గతంలో తను చేసిన ఓ యాక్షన్ సినిమా షూటింగ్‌లో ఎదురైన దారుణమైన పరిస్థితి గురించి చెప్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గతంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు లోదుస్తుల్లోనే స్టంట్స్ చేయాలంటూ మేకర్స్ తనను ఇబ్బంది పెట్టారని రాధిక వెల్లడించింది. “షూటింగ్ మొదలయ్యాక నన్ను లోపల బ్రా లేకుండా కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని, బటన్లు విప్పేసి యాక్షన్ సీన్ చేయగలరా అని అడిగారు. అసలు ఫిజిక్స్ పరంగా అది సాధ్యమేనా అని నేను అడిగాను. ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కానీ, తీరా సెట్‌లోకి వచ్చాక ఆ సీన్‌కు రెండు రోజుల ముందు బేరసారాలు ఆడటం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ పార్ట్ చూపిస్తారా, ఈ పార్ట్ చూపిస్తారా అంటూ రెండు వారాల పాటు నన్ను విపరీతంగా టార్చర్ చేశారు” అంటూ ఆమె ఎమోషనల్ అయింది.

బోల్డ్ సీన్లు చేసేటప్పుడు నటీనటులకు రక్షణగా ఉండే ఇంటిమసీ కోఆర్డినేటర్లు కూడా నిర్మాతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆమె చెప్పింది. ఎవరైనా హీరోయిన్ల తరఫున మాట్లాడితే వాళ్లను ఏకంగా ఉద్యోగాల్లోంచే తీసేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇండస్ట్రీలో అందరూ ఇలా ఉండరని, పది మందిలో ఒకరిద్దరు చేసే ఇలాంటి పనుల వల్లే సమస్యలు వస్తున్నాయని.. ఆ చేదు అనుభవం ఇచ్చిన సినిమా పేరును మాత్రం ఇప్పటికీ తాను బయటపెట్టలేకపోతున్నానని రాధిక చెప్పుకొచ్చింది.