సల్మాన్ రెండవ లోయెస్ట్ రేటెడ్ మూవీగా “రాధే”…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా భాయ్ అభిమానులను నిరాశ పరిచింది.
సల్మాన్ నుంచి ఒక సంవత్సరం తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కొంతమంది సల్మాన్ అభిమానులు ఈ చిత్రం ఈద్ బ్లాక్ బస్టర్ అని అంటున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ‘రాధే’ కథ నుంచి నటీనటుల వరకు అన్నింటిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read
అయితే తాజా సమాచారం ప్రకారం ఐఎండిబిలో లోయెస్ట్ రేటెడ్ చిత్రంగా ‘రాధే’ నిలవడం సల్మాన్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ చిత్రం ఐఎండిబిలో లోయెస్ట్ రేటింగ్ పొందిన సల్మాన్ చిత్రాల్లో రెండవ చిత్రంగా నిలిచింది. 41 658 మందికిపైగా ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వబడింది. ‘రాధే’ రేటింగ్ ఐఎండిబిలో 2.1/10గా ఉంది.
గతంలో సల్మాన్ నటించిన ‘రేస్-3’ చిత్రం ఐఎండిబిలో అతి తక్కువ రేటింగ్ పొందిన చిత్రంగా ఉంది. ‘రేస్-3’ 2018లో ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం రేటింగ్ ఐఎండిబిలో 1.9/10గా ఉంది. మరోవైపు రాధే చిత్రంపై సోషల్ మీడియాలో విమర్శలతో పాటు మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
India vs England: భారత్ చెత్త రికార్డు.. ఏడేళ్ల తర్వాత…!
-
Lenin Review : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..
-
Humanoid Robots: తొలిసారిగా టెలిఆపరేటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్లతో శస్త్రచికిత్స.. వైద్య రంగంలో కొత్త అధ్యాయం
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. వారికి గుడ్న్యూస్..!
-
900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!