పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కాగా పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతుండగా, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ సినిమాలో మరో ప్రముఖ నటి రాశీఖన్నా కూడా భాగమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా వ్యవహరిస్తుండగా, రాశీ ఖన్నా కూడా కథలో కీలక పాత్ర పోషిస్తూండటం సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.
Also Read : Aamir Khan : దేశాన్ని ఊపేసిన హనీమూన్ హత్యపై అమీర్ ఖాన్ సినిమా?
ఇందులో భాగంగా చిత్రబృందం రాశీఖన్నా పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అందులో ఆమె “శ్లోక” అనే పాత్రలో ఒక ఫోటోగ్రాఫర్‌గా కనిపించనుంది. కాగా ఈ పోస్టర్‌తో ఆమె పాత్ర కథలో ఓ ప్రత్యేక స్థానం కలిగి ఉందనే టాక్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా హరీష్ శంకర్ వ్యవహరిస్తుండగా, ఆయన గతంలో పవన్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేపుతోంది. పవన్ మాస్ స్టైల్‌తో పాటు హరీష్ శంకర్ మాస్ ట్రీట్మెంట్‌కు ఇది మంచి కాంబో అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తుండగా, పాటపై కూడా మంచి అంచనాలున్నాయి. నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటుండగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం నుండి, త్వరలోనే మిగిలిన పాత్రల వివరాలు, టీజర్, ట్రైలర్ వంటి అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
