Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’

Gossip Movie

Gossip Movie

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అదే కోవలో నేటి తరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సరికొత్త ఎమోషన్స్, ఒక అందమైన ప్రేమకథను మేళవిస్తూ ప్రస్తుత సమాజంపై గట్టి సోషల్ సెటైర్‌గా వస్తోన్న చిత్రం “గాసిప్” (Gossip). మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ రేపు (జూన్ 26న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమైంది. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి (ఏతి రేమెళ్ల) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించారు.

యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోగా.. ఇటీవలే రిలీజ్ అయిన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుత సమాజంలోని కొన్ని చేదు నిజాలను, మనుషుల మనస్తత్వాలను ప్రతిబింబించేలా ఈ ట్రైలర్ ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రేపు గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత యతి మాట్లాడుతూ.. తమ చిత్ర విడుదలకు ఎంతగానో సహకరిస్తున్న ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ‘పివిఆర్ సినిమాస్’కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సినిమాపై లవ్ చూపిస్తున్న ఆడియన్స్‌కు థాంక్స్ చెప్తూ.. కంటెంట్ నమ్మి తీసిన ఇలాంటి చిన్న సినిమాలను థియేటర్లకు వచ్చి ఆదరించాలని కోరారు.

దర్శకుడు వైభవ్ కౌండిన్య మాట్లాడుతూ.. సినిమా కోసం రేయింబగళ్లు కష్టపడిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్ చెప్పారు. తమ వెనుక నిలబడిన నిర్మాతకు, అలాగే థియేట్రికల్ విడుదలకు సపోర్ట్ ఇస్తున్న పివిఆర్ సినిమాస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకులందరికీ ఈ సోషల్ సెటైర్ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.