Rashi Khanna: పవర్ స్టార్ తర్వాత మెగాస్టారే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో తెలుసు కదా కమిటయ్యందన్న మాటే కానీ ఎంత వరకు వచ్చిందో అప్డేట్ ఉండేది కాదు. ఫస్ట్ సింగిల్ వచ్చాక హమ్మయ్య సినిమా లైన్లోనే ఉందన్న కాన్ఫిడెన్స్ కలిగింది. మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్.
Also Read :Akhanda 2: అఖండ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్ హక్కులతోనే 90% రికవరీ?
Also Read
హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చింది రాశీకి. పవర్ స్టార్ సినిమా అనగానే కథ వినకుండా ఎగిరి గంతులేసి సెట్‌లో వాలిపోయానని చెప్పుకుంటున్న రాశీ ఖన్నా.. ఆనందానికి అవథుల్లేవు. ఇప్పటి వరకు తారక్ మినహా టైర్ 1 హీరోలతో జోడీ కట్టిన దాఖలాలు లేవు అమ్మడు. అందులోనూ మెగా హీరోతో వర్క్ అంటే ఆమెకు కలిసొస్తూ ఉంటుంది. సుప్రీమ్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండుగ చిత్రాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే మరో మెట్టు ఎక్కినట్లే భావిస్తోంది మేడమ్. అయితే మరో లక్కీ ఛాన్స్ రాశీని వెతుక్కుంటూ వచ్చిందన్నది లెటేస్ట్ బజ్.
Also Read :Off The Record: బాలయ్య పేరుతో టీడీపీలో కొత్త కుంపటి అంటుకుంటుందా?
వాల్తేరు వీరయ్య కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు బాబీ. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీగా తెరకెక్కించబోతుంది. మన శంకర్ వర ప్రసాద్ గారూ కంప్లీట్ అయ్యాక చిరు ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడట బాబీ. అందులో బెల్లం శ్రీదేవి అలియాస్ రాశీ ఖన్నాతో పాటు మాళవిక మోహనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమేతే.. మేడమ్ పంట పండినట్లే. రీసెంట్లీ ఓ ఈవెంట్లో పాట పాడినందుకు మన శంకర్ వర ప్రసాద్‌గారులో పాట పాడే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఆ ఛాన్స్ లభిస్తే రాశీకి ఇది అనదర్ హ్యాపీనెస్. ఇక టాలీవుడ్‌లో బిజీ అయితే.. హిందీలో త్రీ, ఫోర్ ఫిల్మ్స్ చేస్తున్న రాశీ.. నార్త్ బెల్ట్‌ను వదిలేసి వచ్చేస్తుందేమో చూడాలి
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!