తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించిన రాశి ఖన్నా, ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో మెరిసే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ఇక అవకాశాలు రావు అనుకుంటున్న సమయంలో ఆమెకు ఆసక్తికరంగా సినిమాల ఆఫర్స్ వరుసగా పలకరిస్తున్నాయి. ఈ మధ్యనే ఆమె చేసిన తెలుసు కదా సినిమా రిలీజ్ అయింది. ఆమె చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలతో పాటు, ఆమె ఒక స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read:S. S. Rajamouli : షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు
ఆమెను ఒక సీనియర్ హీరో పక్కన నటించాల్సిందిగా ఆ సినిమా టీం అప్రోచ్ అయిందట. నిజానికి, ముందు ఆమె ఆ సినిమాలో సీనియర్ స్టార్ హీరో పక్కన కూడా నటించడానికి సిద్ధమై, అగ్రిమెంట్ సైన్ చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే, ఆ క్యారెక్టర్ విన్న తరువాత ఆమె ఆ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని, టీంకి తనకు ఆ పాత్ర మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసినట్లుగా తెలుస్తోంది.
Also Read:Hema Malini: నా భర్త చనిపోయాడనే చేసే ప్రచారం క్షమించరానిది!
సీనియర్ హీరో పక్కన పాత్ర అంటే మామూలుగా ఉంటుంది అనుకుంటే, పాత్ర విన్న తర్వాత అది ఆయన ప్రేమికురాలి పాత్ర అని తెలిసిందని, అలాంటి సీనియర్ హీరో పక్కన అలాంటి పాత్ర చేస్తే తన కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని ఆమె భావించినట్లు సమాచారం. అంత సీనియర్ హీరో పక్కన ప్రేమికురాలి పాత్రలో నటిస్తే, తర్వాత యంగ్ హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వకపోవచ్చు అని భావించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో హీరోయిన్ కోసం సదరు సినిమా యూనిట్ వేటలో పడింది.
