Site icon NTV Telugu

Raashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు

raashi khanna

raashi khanna

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించాడు. నిజానికి రాశి ఖన్నా సినిమా పరిశ్రమకు వచ్చి చాలా కాలమే అయింది కానీ ఆమెకు వేరే హీరోలతో కానీ నటులతో కానీ అఫైర్స్ ఉన్నట్లు వార్తలు చాలా అరుదుగా వచ్చాయి.

Priyanka Mohan: స్టార్ హీరోతో పెళ్లిపై ప్రియాంక మోహన్ క్లారిటీ

అయితే తాజాగా ఆమె తన వివాహం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఏబీపీ సౌత్ సమ్మెలో చేతన్ భగత్ ఆమె వివాహానికి సంబంధించిన ప్లాన్స్ గురించి అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ అది నా పర్సనల్ మేటర్ కాబట్టి ఇప్పుడు నేను డిస్కస్ చేయాలనుకోవడం లేదని సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ నాకు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ దానికి టైం ఉంది అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని కలపాల్సిన అవసరం లేదు అని ఆమె వెల్లడించింది. సబర్మతి రిపోర్టు సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version