2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం “రాంఝానా” AI సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో రీ రిలీజ్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళంలో “అంబికాపతి” పేరుతో ఆగస్టు 1, 2025న రీ-రిలీజ్ అయింది. సినిమా హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ ఏఐతో క్లైమాక్స్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసి, ఈ వివాదంపై తమ వైఖరిని స్పష్టం చేసింది.
Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
ఎరోస్ ఇంటర్నేషనల్ తమ ప్రకటనలో, “రాంఝానా/అంబికాపతి” చిత్రం ఏఐ సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో తిరిగి విడుదల చేయడం “చట్టబద్ధమైన, పారదర్శక, క్రియేటివ్ ఎడిషన్” అని పేర్కొన్నారు. ఈ కొత్త వెర్షన్ అసలైన “రాంఝానా” సినిమాను మార్చడం లేదని, అది అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. “ఈ ఆల్టర్నేట్ ఎడిషన్ సినిమా పరిశ్రమలో దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయానికి అనుగుణంగానే ఉంది, అని ఎరోస్ తెలిపింది. అంతేకాక ధనుష్ చెప్పినట్టు ముందుగా ఆయన టీం నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ తమకు రాలేదని పేర్కొంది.
Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు
ఈ విషయమై ధనుష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘రాంఝనా సినిమాను క్లైమాక్స్‌లో పూర్తిగా మార్చి తిరిగి విడుదల చేయడం నన్ను భాద పెట్టింది. ఈ అసందర్భ ముగింపు సినిమా ఆత్మనే కోల్పోయింది. క్లైమాక్స్ ను మారుస్తున్నామని మేకర్స్ నాకు చెప్పారు. కానీ నేను వద్దని వారించాను అయిన వారు వినాలేదు. ఇది 12 సంవత్సరాల క్రితం నేను కమిట్ అయిన సినిమా కాదు.సినిమాలను లేదా కంటెంట్‌ను మార్చడానికి AI ( Artificial Intelligence ) ను ఉపయోగించడం కళ మరియు కళాకారులకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానం మరియు సినిమా రూపురేఖలను మారుస్తోంది ఇది ఎప్పటికి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలులోకి వస్తాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను’ అని లెటర్ రిలీజ్ చేసారు.
