Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. సెట్లో జరుగుతున్న భారీ స్థాయి వర్క్‌ను చూసిన మంచు లక్ష్మి.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటివరకు చూడని రకాల జీవులు, భారీ మొక్కలు, అద్భుతమైన సెట్స్‌తో పాటు.. పలు విభాగాలకు చెందిన వందలాది మంది కలిసి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మిస్తున్న తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె పేర్కొన్నారు.
‘రాకా’లో కనిపించబోయే ప్రపంచం ప్రేక్షకుల ఊహలకు కూడా అందని స్థాయిలో ఉంటుందని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను తెరపై చూసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక అల్లు అర్జున్ను అట్లీ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘రాకా’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. తాజాగా మంచు లక్ష్మి సెట్ విజిట్ అనంతరం చేసిన కామెంట్స్.. ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందనే విషయంపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి అట్లీ-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
‘రాకా’ సెట్లో మంచు లక్ష్మి.. ఆ విజువల్ వండర్ చూసి ఫిదా!
నటి మంచు లక్ష్మి తాజాగా #Raaka సినిమా షూటింగ్ సెట్‌ను స్వయంగా సందర్శించారు. అక్కడ చిత్రబృందం చేస్తున్న భారీ స్థాయి పనులను చూసి ఆమె ప్రశంసలు కురిపించారు.
ఇప్పటివరకు చూడని రకాల జీవులు, భారీ మొక్కలు, అద్భుతమైన సెట్స్‌తో… pic.twitter.com/AP0XqNrbaQ
— Tupaki (@tupaki_official) August 22, 2026
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?