25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా 3 టిక్కెట్లు కొనుగోలు చేశాడు. సాయంత్రం 4:05 గంటలకు పడాల్సిన ఈ సినిమా సాయంత్రం 6:30 గంటలకు ముగియాల్సి ఉంది. కానీ సినిమా ప్రదర్శన సాయంత్రం 4:05 గంటలకు ప్రారంభం కావడానికి బదులుగా 4:30 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 30 నిమిషాల విలువైన సమయం వృధా కావడం వల్ల షెడ్యూల్ చేసిన పనులకు హాజరు కాలేకపోయాను. దీనివల్ల తనకు నష్టం వాటిల్లిందని అభిషేక్ ఫిర్యాదు చేశాడు. ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా అనవసర లాభం పొందడానికి షో సమయాన్ని తప్పుగా కోట్ చేశారని కోర్టులో వాదించారు. ఈరోజుల్లో సమయాన్ని డబ్బుగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి సమయం చాలా విలువైనది. ఇతరుల సమయం, డబ్బు నుండి లాభం పొందే హక్కు ఎవరికీ లేదు.
Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ హయాంలో పుట్టిన “సాంబార్”.. అసలు కథ ఇదే!
థియేటర్‌లో 25-30 నిమిషాలు ప్రసారం అవుతున్న దాన్ని చూస్తూ కూర్చోవడం చిన్న విషయం కాదు. బిజీ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే వ్యక్తులు అనవసరమైన ప్రకటనలను చూడటం కష్టమని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఫిర్యాదుదారుడి సమయాన్ని వృధా చేసినందుకు రూ. 20,000, మానసిక వేదనకు రూ. 8,000 జరిమానా విధించారు. జరిమానా, వినియోగదారుల సంక్షేమ నిధిలో లక్ష రూపాయలు జమ చేయాలని కూడా ఆదేశించింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుండి 30 రోజులలోపు మొత్తాన్ని చెల్లించడానికి గడువును నిర్ణయించారు. ఇక ఈ సందర్భంలో బుక్‌మైషో బాధ్యత వహించదని, ఎందుకంటే ఇది టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ కి ప్రకటనల స్ట్రీమింగ్ సమయంపై ఎటువంటి నియంత్రణ లేదని పేర్కొంది. తమ వాదనను సమర్థించుకుంటూ, PVR సినిమాస్, INOX సంస్థలు చట్టం ప్రకారం అవగాహన కల్పించడానికి కొన్ని ప్రజా సేవా ప్రకటనలను ప్రదర్శించామని చెప్పాయి. అయితే దానికి సినిమా ప్రారంభానికి 10 నిమిషాల ముందు, సినిమా ప్యాకేజీ రెండవ భాగం ప్రారంభానికి ముందు విరామ సమయంలో ప్రజా సేవా ప్రకటనలను ప్రదర్శించాలని కోర్టు ఆదేశించింది.