NTV Telugu Site icon

Pushpa2TheRule : పుష్ప -2 బుకింగ్స్ కోసం స్పెషల్ యాప్.. కాసేపట్లో బుకింగ్స్ ఓపెన్.!

Pushpa2 (7)

Pushpa2 (7)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏపీ లో టికెట్స్ రేట్స్ ఎంత వరకు పెంచుతారు అనేది  క్లారిటీ రాలేదు.

Also Read : Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!

ఏపీలో ప్రతేక అనుమతుల కోసం ఇండస్ట్రీ కి చెందిన ఓ నిర్మాత అమరావతిలో వేచిచూస్తున్నారు. దేవర కు ఇచ్చిన రేట్స్ కంటే ఎక్కువ అడగడంతోనే ఆలస్యం అయినట్టు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. జీవో రావడం ఆలస్యం ఏపీ బుకింగ్స్ ఓపెన్ చేయాలని మైత్రి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోను ప్రీమియర్స్ తో పాటు అర్ధరాత్రి షోస్ కు థియేటర్లు కేటాయింపులు చేసారు. ఇక నైజాం స్పెషల్ జీవో రావడంతో బుకింగ్స్ ను ఓపెన్  చేయనున్నారు. ఇందుకోసం స్పెషల్ యాప్ ను తీసుకువస్తున్నారు. ఫుడ్ డెలివరీలో పేరొందిన జుమాటో కు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పుష్ప -2 బుకింగ్స్ ను ఓపెన్ చేయనుంది. ఇందుకోసం ఈ రోజు సాయంత్రం 4. 56 గంటలకు బుకింగ్స్ స్టార్ట్ చేస్తునట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా మొదటి రోజు గత సినిమాలు రికార్డులు బద్దలవడం మాత్రం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Show comments