NTV Telugu Site icon

Pushpa2 The Rule :జెట్ స్పీడ్ లో పుష్ప 2 ఓవర్సీస్ ప్రీ సేల్స్

Bunni

Bunni

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజగా విడుదలైన పీలింగ్ సాంగ్ సోషల్  ఆ జోష్ ను మరింత పెంచేలా పుష్ప నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కూతుర్లు

ఇదిలా ఉండగా ఓవర్సీస్ ఆడియెన్స్ లో పుష్ప క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. ఆ క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. నెల రోజుల ముందుగానే పుష్ప బుకింగ్స్ ఓపెన్ చేయగా నార్త్ అమెరికాలో ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ దాటి 2 మిలియన్ మార్క్ కూడా దాటి 2.8 మిలియన్ కు చేరుకుంది పుష్ప -2. ఇక టికెట్స్ పరంగా చుస్తే 74,000 టికెట్స్ బుకింగ్స్ తో సెన్సేషన్ రికార్డు అందుకుంది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం రిలీజ్ నాటికి 4 మిలియన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.  ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తోంది. అటు ఓషియానియాలోను 700$ కలెక్ట్ చేసి ఇప్పరటి వరకు ఏ ఇండియాన్ సినిమా కూడా అందుకొని రికార్డును పుష్ప అందుకుంది. కాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్ లో భారీ ఎత్తున జరగనుంది. అలాగే ఇండియా వైడ్ గాను పుష్ప బుకింగ్స్ ను వైల్డ్ రేంజ్ లో సాగుతున్నాయి.

Show comments