NTV Telugu Site icon

Pushpa2TheRule : బ్యాగ్రౌండ్ కోసం తమన్, అజనీష్ కాకుండా మరొకరు..?

Pushpa2

Pushpa2

 స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప-2’ .   సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. అటు ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 4న ప్రీమియర్స్ తో విడుదల అవుతోంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ పై  మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటి విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయగా త్వరలోనే రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : VarunTej : మట్కా కోసం 4 రకాల డబ్బింగ్.. వరుణ్ తేజ్ కష్టం ఫలించేనా..?
కాగా ఈ సినిమాకు మ్యూజిక్  కు సంబంధించిన విషయంలో గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది.  సుకుమార్ సినిమాలకు రెగ్యులర్ గా పని చేసే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కేవలం సాంగ్స్ కు మాత్రమే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకు అత్యంత కీలకమైన బ్యాగ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ పట్ల మేకర్స్ సంతృప్తిగా లేరు.  అందుకోసం SS తమన్ అలాగే కాంతారాకు సంగీతమే అందించిన అజనీష్ లోక్ నాధ్ ను తీసుకున్నారు. రెండు భాగాలుగా వర్క్ డివైడ్ చేసి వీరిద్దరు వర్క్ మొదలెట్టారు.  తాజగా వీరిద్దరు కాకుండా మరొకరిని కూడా తీసుకున్నారట. ఇటీవల విడుదలైన ‘క’ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన సామ్ CS ను కూడా పుష్ప బీజీమ్ వర్క్ కోసం తెలుసుకున్నారని అందుకు సంబంధించిన వర్క్ కూడా సామ్ CS కు అప్పగించారు అని కూడా తెలుస్తోంది.
Show comments