గతేడాది డిసెంబర్ 4 తేదీ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా అతడి తల్లి చనిపోయుంది. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ కోమాలోకి వెళ్ళాడు. కొన్ని నెలల పాటు మెరుగైన వైద్యం అందించగా కోలుకున్నాడు శ్రీతేజ్.
Also Read : Bollywood : హీరోగా సినిమాలకు బ్రేక్.. దర్శకత్వానికి పని చెప్పబోతున్న హీరో
కానీ ఏడాది గడిచినా శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పటీకి మెరుగుపడలేదు. అతని పరిస్థితి ఇంకా హృదయ విదారకంగా ఉంది. తనంతట తానుగా శ్రీతేజ్ అన్నం తినలేకపోతున్నాడు, శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా మంచం మీద పడి ఉన్నాడు. కనీసం ఎవరినీ గుర్తించే స్థితిలో కూడా లేదట శ్రీ తేజ్. శ్రీతేజ్ ఆరోగ్యం విషయమై తండ్రి భాస్కర్ మాట్లాడుతూ ‘ శ్రీ తేజ్ చికిత్స కోసం నెలకు దాదాపు రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తున్నాము. కానీ ఎలాంటి కదలిక లేదు. మెడికల్ ఖర్చుల కోసం బాగా ఇబ్బందిపడుతున్నాం. సహాయం కోసం అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదించాము. కానీ వారి నుండి సానుకూల స్పందన రాలేదని అన్నారు.
