NTV Telugu Site icon

Pushpa2 : పుష్ప – 2 క్లైమాక్స్ BGM వర్క్ పై ‘సామ్ సీఎస్’ సంచలన ట్వీట్..

Pushpa2therule (2)

Pushpa2therule (2)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప – 2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మరో ముగ్గురు సంగీత దర్శకులు నేపధ్య సంగీతం అందించారు. SS థమన్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ తో పాటు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 కు మొదటి సగానికి థమన్ సంగీతం అందిచాడని, రెండవ సగంలోని కొంత భాగానికి అజనీష్ కొంత మేర వర్క్ అందించగా కకీలక మైన జాతర ఎపిసోడ్ కు సామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ వర్క్ చేసారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Also Read : Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్

నిన్న జరిగిన పుష్ప ఈవెంట్ లో క్లైమాక్స్ లోదేవి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని సుకుమార్ అన్నాడు. ఈ నేపథ్యంలో సామ్ సీఎస్ ‘ పుష్ప2 తో నాకు అద్భుతమైన ప్రయాణం సాగింది. నన్ను పరిగణలోకి తీసుకుని BGMలో పని చేసేనందుకు నాకు ఈ అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు మైత్రీ మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు. నా నిర్మాతలు రవిశంకర్, నవీన్ , చెర్రీ యొక్క మద్దతు మరియు నమ్మకం లేకుంటే ఇది సాధ్యం కాదు. అలాగే అల్లు అర్జున్ సినిమాకు BGM స్కోర్ చేయడం నాకు జోష్ నిచ్చింది. ఇంతటి అద్భుతాన్ని తెరపై మలిచిన దర్శకుడు సుకుమార్ తో కలిసి పని చేస్తున్నందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, పవర్ ప్యాక్డ్ పోరాట సన్నివేశాలకు ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్ కు పని చేయడం ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే ఎడిటర్, నవిన్ నూలి మీ సపోర్ట్ మర్చిపోలేనిది’ అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  మరి ఈ  క్లైమాక్స్ కు BGM స్కోర్ చేసింది ఎవరో సుక్కుకే తెలియాలి.

Show comments