NTV Telugu Site icon

Pushpa The Rule: గంగమ్మ జాతర ఎపిసోడ్.. నీ యవ్వ.. తగ్గేదే లా..

Untitled Design 2024 08 11t094158.012

Untitled Design 2024 08 11t094158.012

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా రాబోతుంది పుష్ప -2. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ లో బన్నీ లేడీ గేటప్ లో కనిపించిన యాక్షన్ ఘట్టాలను చూసాం.

Also Read : Jr.NTR: బాబోయ్.. తారక్ చిన్న కొడుకు ‘భార్గవ్ రామ్’ క్రేజ్ మాములుగా లేదుగా

ఇటీవల ఎడిటింగ్ వర్క్ మొదలుపెట్టిన దర్శకుడు సుకుమార్ ఈ జాతర సన్నివేశాలను ఎడిటింగ్ చేసి యూనిట్ లోని కొందరితో కలిసి వీక్షించాడని తెలిసింది. ఈ జాతర సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ హైదరాబాద్‌లో అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దాదాపు 30 రోజులకు పైగా చిత్రీకరించారట. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఈ సీన్స్ వస్తాయని, సినిమాలో ఇవి కీలకమైన సన్నివేశాలను వందలాది ఆర్టిస్టులతో, ప్రత్యేక మేకప్, లైటింగ్ సెటప్‌లతో తెరకెక్కించిన ఈ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో ఒక భారీ ఫైట్, రెండు సాంగ్స్ ను చిత్రీకరించాడట దర్శకుడు సుక్కు. ఈ సీక్వెన్స్ కాకుండా పుష్ప 2 లో క్లైమాక్స్ లో వచ్చే హెలికాఫ్టర్ రిలేటడ్ సీక్వెన్స్ సుకుమార్ తన మార్క్ లో డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నఈ సినిమాను మైత్రీ మూవీస్ నవీన్, రవి శంకర్ నిర్మిస్తున్నారు.

Show comments