Site icon NTV Telugu

Sukumar: సుక్కు చేతుల మీదుగా హార్లీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!!

Harleys

Harleys

అనేక రకాల వరల్డ్‌ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసిన హైదరాబాదులో మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్‌ ఇండియా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా నేడు ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్‌ మెడోవిక్‌ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్‌ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్‌ నాయక్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్ (హనీ కేక్)ను సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కట్ చేయనున్నారు. ఈ భారీ కేక్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ టైటిల్‌ను గర్వంగా ప్రదర్శిస్తుంది.

Samantha: మా వదిన బంగారం.. సమంత గురించి పోస్ట్ వైరల్

హార్లీస్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్లేలా, స్వచ్ఛమైన తేనెతో తయారయ్యే దీని బరువు 3,000 కిలోలు కాగా 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు… ఉండే భారీ కేక్‌. ఈ విషయంలో గతంలో స్పిన్నీస్‌ దుబాయ్‌ సృష్టించిన మునుపటి రికార్డు కన్నా 10 రెట్లు మిన్నగా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేందుకు , ఈ గొప్ప ప్రయత్నంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమం 6వ తేదీన హైదరాబాద్ మాయా కన్వెన్షన్‌ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది, దీనితో పాటే వినోద కార్యక్రమాలు, బేకింగ్‌ ప్రదర్శనలు ఉంటాయని తెలుస్తోంది.

Exit mobile version