ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సోషల్ మీడియాలో ఎంత పట్టు ఉందో మరోసారి ప్రపంచానికి అర్థమైపోయింది! తాజాగా ఐ.ఎమ్.డి.బి. నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ కేటగిరిలో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ 22.01 శాతంతో అగ్రస్థానంలోనూ, అల్లు అర్జున్ ‘పుష్ప’ 15.7 శాతంతోనే ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి. అయితే… ఈ వార్త ఒక్కసారి సోషల్ మీడియాలో ఫ్లాష్ కాగానే… బన్నీ ఫ్యాన్స్ అంతా తమ చేతికి పని కల్పించారు.
Read Also : వాక్సినేషన్ పై నాని చమత్కారం!
లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ఏమిటంటే… ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తోసిరాజని, ‘పుష్ప’ రాజ్ అగ్రస్థానంలోకి వచ్చేశాడు. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ మూవీ 27.1 శాతంతో ఫస్ట్ ప్లేస్ లోనూ, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమా 21.5 శాతంతో ద్వితీయ స్థానంలోనూ ఉంది. దీంతో మిగిలిన ఎనిమిది సినిమాల పర్శంటేజీలలోనూ స్వల్పంగా మార్పులు ఏర్పడ్డాయి. మరి ఈ పోటీ చివరకు ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.