NTV Telugu Site icon

pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్

Pushpa2

Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.

Also Read : Thangalaan : హమ్మయ్య.. తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది
ఇక ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్  అందుకుని రికార్డ్స్ తిరగరాస్తుంది.  నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టి ప్రీమియర్స్ తో కలిపి  4.4 మిలియన్  తో సూపర్ స్టార్ట్ అందుకుంది. రెండవ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఎక్కడ స్లో అవకుండా పరుగులు తీస్తూనే ఉంది పుష్ప -2. ఇక లేటెస్ట్ గా ఐదు రోజులకు గాను ఈ సినిమాను నార్త్ అమెరికా లో 9.7 మిలియన్ మార్క్ ను సునాయాసంగా దాటేసింది. ఇక ఈ రోజు 10 మిలియన్ మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంటుంది.  ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను రూ. 829 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరిగెడుతోంది పుష్ప. ఇక లాంగ్ రన్ లో పుష్ప రాజ్ ఎంతటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.