Site icon NTV Telugu

తగ్గేదే లే : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో

Pushpa First Single On August 13Th

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Read Also : అల్లు అర్జున్, త్రివిక్రమ్ స్పెషల్ మీటింగ్ !

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమాలోని మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక” అనే ఫస్ట్ సింగిల్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ తో పాటు సంగీతం దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా కన్పించారు. ఈ సాంగ్ మొత్తం 5 భాషల్లో రిలీజ్ కాబోతోందని ప్రోమోలో ప్రకటించారు. ఈ సాంగ్ తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే బన్నీ అభిమానులు ఈ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండవ భాగం 2022లో రిలీజ్ కానుంది.

Exit mobile version