NTV Telugu Site icon

Pushpa 2: The Rule: ఆ దెబ్బకు మైండ్ బ్లాకవ్వాల్సిందే!

Pushpa 2 Climax

Pushpa 2 Climax

ప్రస్తుతం ఇండియా వైడ్ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప ది రూల్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, ఆయన పెర్ఫార్మన్స్ తో పాటు జాతర ఎపిసోడ్ స్పెషల్ హైలెట్స్ గా చెబుతున్నారు. ఇక సుకుమార్ అయితే ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమాని తన లైఫ్ లోనే మెమొరబుల్ సినిమాగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 3 అవకాశాలు కూడా ఉన్నాయని సినిమా టీం క్లారిటీ ఇచ్చింది. పుష్ప సెకండ్ పార్ట్ చివరిలో థర్డ్ పార్ట్ కి మంచి లీడ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

Darshan Bail: దర్శన్ కి బెయిల్.. రేణుకాస్వామి తండ్రి షాకింగ్ స్టేట్మెంట్

అంటే థర్డ్ పార్ట్ లో మరో కొత్త యాక్టర్ ను చూపించబోతున్నారని ఆయన వాయిస్ ఓవర్ తోనే సెకండ్ పార్ట్ ముగిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఏ యాక్టర్ ని అలా పెడితే బాగుంటుందా అనే విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. మరోపక్క సెకండ్ పార్ట్ కి సంబంధించిన స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధ కపూర్ ని తీసుకురాబోతున్నారు అని తెలుస్తుంది. నవంబర్ 4వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ప్రస్తుతానికి సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టారు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Show comments