NTV Telugu Site icon

Pushpa2: రిలీజ్ కి ముందు మొట్ట మొదటి సినిమాగా సంచలన రికార్డు..

Pushpa 3

Pushpa 3

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ని లేటుగా రిలీజ్ చేశారు. ఎందుకంటే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా టికెట్స్ ముందు అమ్మకం చేయించారు.

Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?

కాస్త లేటుగా రిలీజ్ చేసిన సరే ఈ సినిమా రిలీజ్ కి ముందే 2.3 మిలియన్ టికెట్లు అమ్మకాలు జరిపినట్లుగా ప్రకటించింది బుక్ మై షో. ఇప్పటివరకు ఈ రికార్డు విజయ్ లియో సినిమా పేరిట ఉండేది కానీ ఆ సినిమా రికార్డు బద్దలు కొడుతూ ఈ సినిమా ఇంకా రిలీజ్ కి కొన్ని గంటలు ఉండగానే రికార్డు బ్రేక్ చేయడం గమనార్హం. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన వాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments