NTV Telugu Site icon

Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్

Devisri

Devisri

పుష్ప -2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్శి జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ -1 టోటల్ వర్క్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2 కు వచ్చే సరికి మొత్తం వ్యవహరం మారిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే తీసుకున్నారు. BGM వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కు భాద్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప -2 మొత్తం సినిమాకు BGM ఫినిష్ చేసాడు కానీ ఆ అవుట్ పుట్ పట్ల అటు దర్శకుడు సుకుమార్, ఇటు హీరో బన్నీ సంతృప్తి చెందలేదని టాక్.

Also Read : Megastar : చిరు – అనిల్ రావిపూడి- సైన్ స్రీన్స్

దాంతో SS థమన్ కు ఫస్ట్ హాఫ్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ కు సెకండ్ హాఫ్ లోని కొంత పోర్షన్, సామ్ సీఎస్ కు క్లైమాక్స్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. థమన్ కేవలం 15 రోజుల్లో తన వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇచ్చాడు. మరోవైపు సామ్ సీఎస్ కూడా తన వర్క్ ను ఫినిష్ చేసి ఇచ్చాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడట దర్శకుడు సుకుమార్. థమన్ ఇచ్చిన మ్యూజిక్ ను మళ్ళి వద్దు అనుకున్నాడట. అలాగే అజనీష్ లోక్ నాధ్ వర్క్ ను సైతం పక్కన పెట్టేశారట.ఈ రెండు పోర్షన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినబ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే కంటిన్యూ చేశారట. సామ్ సీఎస్  క్లైమాక్స్ కు చేసిన వర్క్ కూడా తీసుకున్నారు. సో ఫైనల్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ కేవలం దేవిశ్రీప్రసాద్, శామ్ సి.ఎస్ లది మాత్రమే వాడారట.

Show comments