NTV Telugu Site icon

Pushpa 2 : చెక్కుతూనే ఉన్న సుకుమార్ .. ఫ్యాన్స్ లో నజర్

Pushpa2

Pushpa2

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుడల చేయగా మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 21 న గుమ్మడికాయ కొడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదనే టాక్ యూనిట్ నుండి వినిపిస్తుంది.

Also Read : Mollywood : మెగాస్టార్ – కంప్లిట్ స్టార్ భారీ మల్టీ స్టార్ట్.

అందుతున్న సమాచారం మేరకు ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 21 తో ఫినిష్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసేసి చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే రెండు మూడు రోజులు కేటాయించి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని ప్లానింగ్ చేసారు. కానీ ఇప్పుడు మొత్తం ప్లానింగ్ మారిపోయిందట. ముందుగా పక్కన పెట్టిన ఈ సినిమాలోని నాలుగవ సాంగ్ ను ఇప్పుడు మరల షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 22 నుండి ఈ సాంగ్ ను షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నరట. విడుదలకు కేవలం కేవలం అతి కొద్ది రోజులు గడువు ఉండగా సుకుమార్ ఇంకా సినిమాను చెక్కే పనిలో ఉన్నాడు. ఈ టైమ్ లో సాంగ్ అవసరమా అనే ప్రశ్న ఫ్యాన్స్ నుండి వినిపిస్తుంది. అయినా సరే సుక్కు ఈ షూట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

Show comments