NTV Telugu Site icon

Pushpa 2 Stampede: ఆ బాలుడు ఎవరినీ గుర్తు పట్టలేడు.. మాటలు అర్థం కావు!

Sritej

Sritej

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక తల్లి మృత్యువాత పడగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే సదరు బాలుడిని తొలత పేరు వేరు హాస్పిటల్స్ లో చికిత్స అందించినా చివరిగా కిమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. ఇక ఈ రోజుతో ఆ బాలుడు కిమ్స్ హాస్పిటల్ లో చేరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్ ఇచ్చారు. బాలుడికి ఇంకా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?

ఇప్పటికీ కూడా బాలుడికి స్పర్శ తెలియడం లేదని, ఆ బాలుడు ఎవరిని గుర్తు పట్టలేదని అన్నారు. అదే విధంగా మనం మాట్లాడే మాటలు సైతం అర్థం చేసుకోలేడని వెల్లడించారు. ఇక ఆ బాలుడికి ట్యూబ్ ద్వారా నేరుగా పొట్టలోకి ఆహారం పంపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఆ బాలుడు ఆస్పత్రి ఖర్చులు అల్లు అర్జున్ టీం భరిస్తుందని అతని తండ్రి భాస్కర్ మీడియాకు వెల్లడించారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలన హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్లో సైతం ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.