NTV Telugu Site icon

Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!

Kissik

Kissik

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ఒకరకంగా సుకుమార్ చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని సుకుమార్ కూడా సహ నిర్మిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్ ని బీహార్ వేదికగా రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.

Galla Ashok: దేవకీ నందన వాసుదేవ’ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి!

ఇక ఇప్పుడు దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నవంబర్ 24వ తేదీ అంటే ఈ ఆదివారం నాడు చెన్నైలో ఒక ఈవెంట్ నిర్వహించేందుకు పుష్ప టీం సిద్ధమైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రోజు అదే ప్రాంగణంలో ఈ సినిమాలో ఐటెం సాంగ్ కిస్సిక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల కాలు కదిపింది. వీరిద్దరి డాన్స్ స్టెప్పులు ఒక రేంజ్ లో సెట్ అయ్యాయి అంటూ టాక్ వినిపిస్తోంది. ఆరోజు ఈ సాంగ్ రిలీజ్ కాబోతూ ఉండడంతో అందరిలో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన అసెట్ గా నిలవబోతోంది అని చెప్తున్నారు.

Show comments