NTV Telugu Site icon

Pushpa 2: ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్నేసిన పుష్ప 2

Pushpa 2 Rrr

Pushpa 2 Rrr

పుష్ప2 రిజల్ట్‌ లా వున్నా..రికార్డుల టాపిక్‌ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఇండియాలో వున్న రికార్డ్స్‌ అన్నీ బ్రేక్‌ అయిపోవాలి అనే టార్గెట్ కోసం పుష్ప2 టీం ఫోకస్‌ పెట్టడమే కాదు… రాజమౌళి, మహేశ్‌ మూవీ వచ్చే వరకు పుష్ప2 నెలకొప్పే ఫస్ట్‌ డే రికార్డ్‌ బ్రేక్‌ కాకూడదన్నట్టు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణాలో టిక్కెట్‌ రేట్లు పెంచిన విధానం చూస్తుంటే.. పుష్ప2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్‌ చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి పుష్ప2కు అన్నీ కలిసొచ్చాయి. టిక్కెట్ రేట్లు భారీగా పెంచుకునే ఛాన్స్‌.. బెనిఫిట్‌ షోస్‌.. ఎగస్ట్రా షోస్‌ వేసుకునే వెసులుబాటు ప్లస్‌ కానుంది. రిలీజ్‌కు ముందు.. మూడు వారాల వరకు మరో పెద్ద సినిమా లేకపోవడం.. వరల్డ్‌ వైడ్‌గా 12,500 స్క్రీన్స్‌లో రిలీజ్‌ కావడం చూస్తుంటే.. ఆర్‌ఆర్ఆర్‌ పేరు మీదున్న ఫస్ట్‌ డే రికార్డ్‌ బ్రేక్‌ అయిపోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. అయితే.. మొదటి రోజు ఎంత కలెక్ట్‌ చేసే ఛాన్స్‌ వుంది? అనే చర్చలు మొదలయ్యాయి.

Preity Mukhundhan: సౌత్ ఇండస్ట్రీకి మరో క్రష్ దొరికేసిందోచ్!

తెలంగాణాలో భారీగా పెరిగాయి ఈ టిక్కెట్‌ రేట్లు. సినిమా రిలీజ్ అయిన 19 రోజుల వరకు పెంచుకునే పర్మిషన్‌ ఇచ్చారు. 20వ రోజు నార్మల్‌ టిక్కెట్‌ రేట్లతో పుష్ప2 ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 4న రాత్రి 9.30కి బెనిఫిట్‌ షోస్‌కు పర్మిషన్‌ ఇవ్వగా అర్ధరాత్రి ఒంటిగంటతో స్పెషల్‌ షోస్‌ మొదలు కానున్నాయి. బెనిఫిట్‌ షో టిక్కెట్‌ రేటు రూ. 800గా ఉండనుంది. 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.150.. మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంపు ,9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.105.. మల్టీప్లెక్స్‌లో రూ. 150, 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.20.. మల్టీప్లెక్స్‌లో రూ50 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చారు. ఇక ఇండియాలో హయ్యెస్ట్‌ ఫస్ట్‌ డే రికార్డ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ పేరుతో 223 కోట్ల రికార్డ్ ఉంది. 10,200 థియేటర్స్‌లో RRR రిలీజ్‌ కాగా 12,500 స్క్రీన్స్‌లో పుష్ప2 విడుదల కానుంది. దీంతో పుష్ప 2కి వరల్డ్‌వైడ్‌ ఫస్ట్‌ డే 300 కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తున్నారు.