Pushpa 2: ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్నేసిన పుష్ప 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 రిజల్ట్ లా వున్నా..రికార్డుల టాపిక్ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఇండియాలో వున్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి అనే టార్గెట్ కోసం పుష్ప2 టీం ఫోకస్ పెట్టడమే కాదు… రాజమౌళి, మహేశ్ మూవీ వచ్చే వరకు పుష్ప2 నెలకొప్పే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాకూడదన్నట్టు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణాలో టిక్కెట్ రేట్లు పెంచిన విధానం చూస్తుంటే.. పుష్ప2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి పుష్ప2కు అన్నీ కలిసొచ్చాయి. టిక్కెట్ రేట్లు భారీగా పెంచుకునే ఛాన్స్.. బెనిఫిట్ షోస్.. ఎగస్ట్రా షోస్ వేసుకునే వెసులుబాటు ప్లస్ కానుంది. రిలీజ్‌కు ముందు.. మూడు వారాల వరకు మరో పెద్ద సినిమా లేకపోవడం.. వరల్డ్ వైడ్‌గా 12,500 స్క్రీన్స్‌లో రిలీజ్ కావడం చూస్తుంటే.. ఆర్‌ఆర్ఆర్ పేరు మీదున్న ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ అయిపోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. అయితే.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ వుంది? అనే చర్చలు మొదలయ్యాయి.
Preity Mukhundhan: సౌత్ ఇండస్ట్రీకి మరో క్రష్ దొరికేసిందోచ్!
Also Read
- Nayanthara : మహాశక్తి'తో కంబ్యాక్ ఇస్తుందా?
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
తెలంగాణాలో భారీగా పెరిగాయి ఈ టిక్కెట్ రేట్లు. సినిమా రిలీజ్ అయిన 19 రోజుల వరకు పెంచుకునే పర్మిషన్ ఇచ్చారు. 20వ రోజు నార్మల్ టిక్కెట్ రేట్లతో పుష్ప2 ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 4న రాత్రి 9.30కి బెనిఫిట్ షోస్‌కు పర్మిషన్ ఇవ్వగా అర్ధరాత్రి ఒంటిగంటతో స్పెషల్ షోస్ మొదలు కానున్నాయి. బెనిఫిట్ షో టిక్కెట్ రేటు రూ. 800గా ఉండనుంది. 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.150.. మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంపు ,9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105.. మల్టీప్లెక్స్‌లో రూ. 150, 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.20.. మల్టీప్లెక్స్‌లో రూ50 పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఇండియాలో హయ్యెస్ట్ ఫస్ట్ డే రికార్డ్ ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో 223 కోట్ల రికార్డ్ ఉంది. 10,200 థియేటర్స్‌లో RRR రిలీజ్ కాగా 12,500 స్క్రీన్స్‌లో పుష్ప2 విడుదల కానుంది. దీంతో పుష్ప 2కి వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే 300 కోట్లకు పైగా వస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?