NTV Telugu Site icon

Pushpa – 2 : స్పెషల్ సాంగ్ శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Pushpa

Pushpa

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘పుష్ప-2 ది రూల్‌’. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శత్వంలో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.

Also Read : Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ సూపర్ స్టార్

ఈ సినినిమాలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. అయితే, ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ చేనందుకు ఎంత తీసుకుంది అనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ్ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పుష్ప 1 లో నటించిన సమంత ‘ఊ అంటావా’ సాంగ్‌కా ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. మరి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ను కాదని శ్రీలీలను తీసుకోవడంతో ఏ మేరకు ఇచ్చారు అనే టాక్ రావడం సహజం. వినిపిస్తున్న సమాచారం మేరకు కిస్సిక్‌ సాంగ్ కోసం శ్రీ లీల రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటుందట. కాగా ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్టు యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న పుష్ప డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Show comments