Site icon NTV Telugu

Purusha : ‘పురుష:’ టైటిల్ పోస్టర్‌ రిలీజ్

Purusha

Purusha

కామెడీ చిత్రాలకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి గట్టి ఆదరణ లభిస్తోంది. లాజిక్ లేకపోయినప్పటికీ, కామెడీ బాగా కుదిరితే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘పురుష:’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం పట్ల అంచనాలు పెంచేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు .

Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?

విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం నాడు ఈ చిత్రాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వడ్డవల్లి వెంకటేశ్వరరావు (బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా, బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’, ‘మసుద’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరు ఉలవలను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. తన శిష్యుడి కోసం ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో మరియు పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం, చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి పనిచేస్తున్నారు. సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి. గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version