సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది.
Also Read : “పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్?
ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ టీమ్ ను తీసుకొచ్చారు. ముంబైలోని ఓ భారీ సెట్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ మరింత ఆసక్తిని పెంచేస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే… డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రం కోసం అమెరికన్ లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ ను రంగంలోకి దించబోతున్నారట. సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్ లో ఈ ఇంటర్నేషనల్ బాక్సర్ ను తీసుకురాబోతున్నారట. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.