Site icon NTV Telugu

Yento Antha Sarikothaga: ఆసక్తికరంగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

Eno

Eno

ప్రేమ కథా చిత్రాలెప్పుడూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా రోజులే అవుతున్నాయి. ఈ క్రమంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము.ఎం నిర్మాతగా రాజ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. ఈ అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురువారం నాడు రిలీజ్ చేశారు.

‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్‌కు తగ్గట్టుగా ఈ చిత్రంలోని బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో హీరో, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పని చేస్తుంటారు. గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలు చూపిస్తూ అందమైన ప్రేమను తెరపై ఆవిష్కరించబోతోన్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఎంతో కూల్‌గా కనిపిస్తోంది. అన్ని రకాల అంశాలను జోడించి ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీని రూపొందించారు. పల్లెటూరి వాతావరణం, ప్రశాంతత నేపథ్యంలో చాలా కూల్‌గా, ఆహ్లాదకరంగా సాగే ఓ అపురూపమైన ప్రేమ కథగా ‘ ఏంటో అంతా సరికొత్తగా ’ ఆడియెన్స్ ముందుకు రానుంది. త్వరలోనే ఇతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Exit mobile version