NTV Telugu Site icon

Puri Jagannadh: మళ్ళీ సీక్వెల్ మీద కూర్చుంటున్న పూరి జగన్నాథ్?

Puri Jagannadh Birthday

Puri Jagannadh Birthday

డబుల్ ఇస్మార్ట్ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి మరో సీక్వెల్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకునే ఆయన ఈసారి మాత్రం గోవా వెళ్లారు. ఆయన కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే కాదు రెండు మూడు స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గోపీచంద్ హీరోగా తెరకెక్కిన గోలీమార్ సినిమా ఫోటోలో మంచి హిట్గా నిలిచింది. పూరి జగన్నాథ్ తో పాటు గోపీచంద్ కెరీర్ లో కూడా మంచి సినిమాగా నిలిచింది.

Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?

ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ చేద్దామా అని పూరి జగన్నాథ్ అడిగిన వెంటనే గోపీచంద్ కూడా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత రెండు మూడు స్క్రిప్స్ సిద్ధం చేసుకున్నాడు. కానీ అందరు హీరోలు బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన సీక్వెల్ మీద ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోపక్క గోపీచంద్ రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి జిల్ అనే సినిమా చేశారు. అలాగే సంకల్ప్ రెడ్డి చెప్పిన మరో సినిమాకి కూడా గోపీచంద్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఏఈ సినిమాలలో ముందు ఏ సినిమా పట్టాలెక్కుతోంది అనే విషయం మీద క్లారిటీ లేదు..