Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం జరగని రీతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ.. “రెంటల్ విధానంలో ఒక థియేటర్ కి రూ. 7.30 లక్షలు వస్తుందనుకుంటే, పర్సంటేజ్ పద్ధతిలో ఆ ఓనర్ రూ. 10 లక్షల వరకు ఆశించడంలో తప్పులేదు. కానీ, ఏకంగా పాతిక లక్షలు ఇవ్వాలని పట్టుబడితే అది ఎంతమాత్రం సహేతుకం కాదు. సినిమాల్లో నష్టాలు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే నాథుడే లేడు. అప్పుల పాలై ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. ‘అఖండ 2’ లాంటి సినిమాకు నష్టాలు వస్తే నిర్మాత గురించి ఎవరు మాట్లాడారు? పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే, ఇక చిన్న సినిమా నిర్మాతల ఇబ్బందులు వర్ణనాతీతం. ఎగ్జిబిటర్‌కి తన థియేటర్ ఒక సేఫ్ ప్రాపర్టీగా ఉంటుంది. కానీ హీరోలు తక్కువ సినిమాలు చేయడం వల్ల ప్రస్తుతం ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు” అని విశ్లేషించారు.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన పర్సంటేజ్ సబ్ కమిటీపై నట్టి కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఈ సబ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న డి. సురేష్ బాబు, దిల్ రాజు ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా ఎంతో క్లోజ్. కానీ వారు లీజ్ ఓనర్స్ అవ్వడం వల్ల సహజంగానే ఎగ్జిబిటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అన్యాయం జరుగుతుందనే అనుమానాలు పరిశ్రమలో చాలామందికి ఉన్నాయి. అందుకే వారిద్దరూ ఈ కమిటీ నుండి తప్పుకోవాలి. వారి స్థానాల్లో కె.ఎల్. నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి నిష్పాక్షికమైన వ్యక్తులను నియమించాలి. సురేష్ బాబు, దిల్ రాజు కావాలనుకుంటే కమిటీలో ఎగ్జిబిటర్ల తరపున నిలబడి వాదించుకోవచ్చు. నిజమైన బి-ఫారమ్ లైసెన్స్ ఉన్న థియేటర్ ఓనర్స్ కాకుండా, లీజ్ ఓనర్లే ఇప్పుడు చక్రం తిప్పుతూ తమకు భారీ లాభాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆందోళన అందరిలోనూ ఉంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?