Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: టాలీవుడ్లో ఎప్పుడూ లౌడ్‌గా, స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటూ ‘ఫైర్ బ్రాండ్’ అనిపించుకునే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్‌గా ఉండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉంటున్నారని, కామెంట్స్ చేయడం తగ్గించారని వస్తున్న రూమర్లపై తనదైన శైలిలో స్పందించారు. తన మౌనం వెనుక ఒక బలమైన వ్యూహం ఉందని చెబుతూ తనను టార్గెట్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. “వాళ్లు డబ్బు ఉన్నోళ్లు.. ఏమన్నా మాట్లాడతారు. వాళ్లు అన్న మాటలకి మనం ఇమ్మీడియట్‌గా రిప్లై ఇస్తే.. వాళ్ల మీద మనకి జెలసీ (అసూయ) ఉందని అనుకుంటారు. అందుకే నేను వెనక్కి తగ్గాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేం కంటెంట్ ఓనర్లం! మేం చేయాల్సిన డ్యామేజ్ ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో మాకు బాగా తెలుసు. దానికి కచ్చితంగా ఒక టైమ్ వస్తుంది” అని నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఫిలిం ఛాంబర్ మీటింగుల్లో జరిగిన వాడివేడి చర్చల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఛాంబర్లో నిర్మాతలు అరుచుకోవడం, గొడవలు పడటం అనేది చాలా కామన్ విషయమని, దీనిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అయితే తనపై విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “ఇక్కడి నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లరు, అందరం ఇండస్ట్రీలోనే ఉండాలి. మెల్లిగా నా దగ్గరున్న అస్త్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి, అప్పటివరకు వేచి చూడండి” అంటూ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే ఆయన నిర్మాతగా అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటించారు. తమన్ స్వరాలు అందించగా అక్కినేని నాగార్జునతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?