Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!

Elage Pilla

Elage Pilla

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) చేతుల మీదుగా ‘ఎలగే పిల్ల’ అనే బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ చేసిన అనంతరం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చిత్రయూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ పాట చాలా క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ మరియు హీరో వేసిన సింపుల్ స్టెప్పులు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ఆగస్ట్ 7న రిలీజ్ కాబోతున్న ఈ రస్టిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ సాంగ్స్ యూట్యూబ్‌లో ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు వచ్చిన ‘ఎలగే పిల్ల’ సాంగ్ కూడా ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారే లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ అందించిన అద్భుతమైన సాహిత్యం ఈ పాటకు ప్రాణం పోయగా.. కపిల్ కపిలాన్, దేవ్ జండ్ ల గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హీరో విక్రమ్ సహిదేవ్ ఈ రొమాంటిక్ ట్రాక్‌లో తన గ్రేస్ మరియు సింపుల్ హుక్ స్టెప్స్‌తో అదరగొట్టాడు. ఈ స్టెప్స్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో విపరీతంగా ట్రెండ్ అయ్యేలా కనిపిస్తున్నాయి.